మనలోన ప్రతివారు - తనగురించి తానే Manalona || Worship by church youth

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • మనలోన ప్రతివారు - తనగురించి తానే
    దేవునికి లెక్క అప్పగించవలెను
    ఘన దేవునికి లెక్క అప్పగించవలెను //మనలోన//
    మనుష్యులు పలుకు వ్యర్ధమైన ప్రతి మాటకు
    విమర్శ దినమున లెక్క చెప్పవలయును
    ఈ నాటి నుండి నీనోటిమాట
    సరిచేసికొని సిద్ధపడు సోదరా - 2. //మనలోన//
    దేహముతో చేసిన - ప్రతి కార్యము గూర్చి
    అవి మంచివైనను - చెడ్డవైనను
    ప్రతివాడును తన ఫలమును పొందుటకు
    నిలువవలె క్రీస్తు న్యాయపీఠం ఎదుట - 2. //మనలోన//
    నీ ధన ధాన్యములు నీకున్న సమయమును
    ఎలాగు నీవు వ్యయపరచుచుంటివో
    ప్రభు భాగము నీవు చెల్లించుచున్నావా
    ప్రతి దానికి ప్రభు నిన్ను లెక్క అడుగును. //మనలోన//
    మన యజమానుడు - త్వరలో రానుండే
    రాజాధిరాజుగా - న్యాయాధిపతిగా
    మన ప్రతి పనిని - పరీక్షించును
    నమ్మకస్థులైన వారు - ఏలుదురు ప్రభువుతో - 2. //మనలోన//

Комментарии •